Header Banner

రథ సప్తమి రోజు తెలుగు రాష్ట్రాల్లో భగభగ మంటున్న ఎండలు! అత్యధిక ఉష్ణోగ్రతల హెచ్చరిక!

  Tue Feb 04, 2025 09:07        Others

భారత వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఎలాంటి వాతావరణ సూచనా చెయ్యలేదు. ఎందుకంటే.. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉన్నాయి. కానీ భూమధ్య రేఖా ప్రాంతంలో 5 అల్పపీడనాలు, 2 తుపాన్లూ ఉన్నాయి. వాటి ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతానికి లేదు. అందువల్ల ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మనం శాటిలైట్ అంచనాలను చూస్తే.. ఏపీ, తెలంగాణపై రోజంతా చిన్నపాటి మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ అవి చల్లదనం ఇవ్వలేవు. వాటిని మించిన వేడి భూమిని తాకుతోంది. సూర్య కిరణాలు డైరెక్టుగా తెలుగు రాష్ట్రాలపై పడుతున్నాయి.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


అందులోనూ ఇవాళ రథ సప్తమి కావడం మరో ప్రత్యేకత. సూర్యుడి పుట్టిన రోజున ఆ మాత్రం వేడి రాకుండా ఉంటుందా! గాలి వేగం చూస్తే.. బంగాళాఖాతంలో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గంటకు 13 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఐతే.. ప్రస్తుతం గాలులన్నీ తుపాన్లు ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వైపు వెళ్లిపోతున్నాయి. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం తక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. ఏపీలో ఇవాళ 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


అందువల్ల మనం ఎండ నుంచి కాపాడుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. నీడపట్టున ఉండాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే, నీరు, పండ్ల రసాల వంటివి తీసుకుంటూ ఉండాలి. తేమ సంగతి చెప్పక్కర్లేదు. బాగా తగ్గిపోయింది. ఏపీలో 33 శాతం, తెలంగాణలో 30 శాతం తేమ మాత్రమే ఉంది. ఇవాళ పశ్చిమ తెలంగాణలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పశ్చిమ రాయలసీమ భగ్గుమంటుంది. ఇలా వాతావరణం తీవ్రంగా మారుతోంది. ప్రయాణాలు చేసేవారికి కూడా ఇబ్బంది కలిగించేలా ఉంటోంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ap #telngana #heavyheat #todaynews #flashnews #latestupdate #extream #temparature